సమాలోచన

 

అద్వైత తన బిటెక్ పూర్తి చేసుకొని  ఎంటెక్ చేయాలి  అని అనుకుంటున్న సమయంలో వాళ్ల తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూస్తూ ఉంటారు.
అద్వైత స్వాతంత్రగా ఉండటం ఇష్టం.ఎవరి మీద ఆధారపడకుండా జీవించాలి అని నిచ్చంచుకుంటది. అద్వైత వాళ్ల నాన్న ఒక మామూలు  ఉద్యోగి, వాళ్ళ అమ్మ గృహిణి. అద్వైత ఒక అన్న ఉంటాడు. అన్న ఏమో పని పాట లేకుండా తిరుగుతుంటాను.
కూతురికి పెళ్లి చేసి అత్తగారి పంపితే తన బాధ్యత తీరిపోతుందని అద్వైత నాన్న భావిస్తాడు. అద్వైత కి మెకానికల్ ఆటోమొబైల్ ఇంజనీర్ కావాలని కోరిక. దీని గురించి వాళ్ళ అమ్మ నాన్న తో చెబుతుంది వాళ్ల నాన్న మాత్రం చదివింది చాలు అని అంటాడు. అప్పుడు వాళ్ళ నాన్న తో గొడవ పడి నేను పెళ్లి చేసుకోను అని ఖండిగా చెబుతుంది. అప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నతో  మాట్లాడి ఒప్పిస్తుంది. తను చాలా కష్టపడి ఎంటెక్ అడ్మిషన్ పొందుతుంది. కాలేజీలో జాయిన్ అయిన కొన్ని రోజులు వరకు వాళ్ళ బంధువుల ఇంటి నుండి కాలేజీ కి వెళుతుంది. అలా వెళ్తున్న తనకి ఒకరోజు బస్టాండ్ లో అన్వేష్  తారసపడతాడు. అతను ఒక వృద్ధుడి తో మాట్లాడుతూ కనబడతాడు.  అలా రోజు బస్టాండ్ లో అన్వేష్ ని చూస్తూ ఉంటది.అద్వైతకి అన్వేష్ అంటే ఇష్టం కలుగుతుంది. అలా అతని గురించి ఆలోచించుకుంటూ కాలేజీ కి వెళ్తుంది.
కాలేజీ మెట్లు ఎక్కుతున్న సమయంలో అన్వేష్ కనిపిస్తాడు .అన్వేష్  ఇదే కాలేజీలో కంప్యూటర్ సైన్స్ చేస్తుంటాడు. అన్వేష్ ది గ్రామీణ కుటుంబ నేపథ్యం.అన్వేష్ కి ఒక బెస్ట్ సాఫ్ట్వేర్ డెవలపర్ కావాలనే కోరిక.అన్వేష్ కి అమ్మ మాత్రమే ఉంటుంది.అన్వేష్ కి అమ్మాయలు అంటే మొహమాటం.

అద్వైత తన చదువు మీద శ్రద్ధ పెడుతుంది.అద్వైత కి డాన్స్ అంటే చాలా ఇష్టం.తను మంచి క్లాసికల్ డాన్సర్.చదువుతూ, తన కళ ను మెరుగుపరుస్తుంది.
ఒక రోజు కాలేజిలో ఇంట్రడ్యూస్ ప్రోగ్రామ్ నందు అన్వేష్ ఒక చక్కటి స్పీచ్ ఇస్తాడు. ఆ స్పీచ్ విని అద్వైత కి  అన్వేష్ పై ప్రేమ కలుగుతుంది. అరవింద్ చూడాలని ప్రతిరోజు అన్వేష్ వెళ్ళే  చోటుకు వెళ్తుంది.అన్వేష్ కి అప్పుడపుడు కొన్ని గిఫ్ట్స్ వేరే వాళ్ల గా పంపిస్తుంది.
అద్వైత తన చదువులో ముందు ఉంటుంది.అల మొదటి సంవత్సరం పూర్తి అయ్యింది.సెలవులు ఇచ్చారు.అందరూ తమ తమ ఊరికి వెళ్తారు.అన్వేష్ నీ చూడాలని బస్టాండ్ వరకు వెళ్తుంది.అల అన్వేష్ జ్ఞాపకాలతో సెలవులు పూర్తి అవుతాయి.సెలవులు అనంతరం కాలేజీ కి వెళ్తుంది.
కాలేజీ లో అన్వేష్ కనపడక పొయ్యే సరికి తనలో ఎదో తెలియని బాధ కనపడుతుంది.అన్వేష్ వల్ల అమ్మ కి ఆరోగ్యం సరిగా లేక తన ఇంటి వద్దే ఉంటాడు.అన్వేష్ కొన్ని రోజులు తరువాత కాలేజీ కి వస్తాడు.అన్వేష్ నీ చుసుచూడగనే కౌగలించుకొని ముద్దాడలనీ  అనిపిస్తుంది.కానీ చెప్పాలంటే భయం.
అలా రోజులు అలా గడుస్తున్న తరుణంలో ఒకరోజు అద్వైత కి  ఒక ఉత్తరం వస్తుంది. ఉత్తరం చదివి వారినీ కలవాలని వెళుతుంది. వెళ్లిన చోట అన్వేష్ ను చూసి ఆశ్చర్యం తో   నువ్వేనా నాకు ఉత్తరం రాసింది  అని అడుగుతుంది అప్పుడు అన్వేష్ అవును నేనే రాశాను అని అంటాడు ఎందుకు రాసావు అని అడగగా నీకు ఒక విషయం చెప్పాలని రాశాను అని అంటాడు. భయం తో ఏమిటి  అని అడుగుతుంది. అప్పుడు అన్వేష్ నువ్వంటే నాకు ఇష్టం .నేను నిన్ను ప్రేమస్తున్నాను ,నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతాడు అది వినగానే అద్వైత ఆశ్చర్యపోయే ఏమిటి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగుతుంది. అవును అని అన్వేష్ తన ప్రేమ కథను ఇలా చెబుతాడు. ఒకరోజు నేను బస్సులో వస్తుండగా నేను నిన్ను బస్టాండ్ లో చూశాను చూసి చూడగానే నువ్వంటే ఏర్పడింది తర్వాత నిన్ను మన కాలేజ్ ఫంక్షన్ లో మరోసారి చూశాను అప్పుడు అర్థమైంది నువ్వంటే నాకిష్టమని అలా నీ మీద ప్రేమ పెరుగుతూ వచ్చింది కానీ మీతో మాట్లాడాలంటే కొంచెం భయం చెబితే ఎలా ఉంటుందో అని భయంతో ఎన్నిరోజులు తప్పలేదు కానీ ఇప్పుడు చెప్పకపోతే ఇంకెప్పుడు చెప్పలేదు అన్నా భయంతో ఈరోజు నీకు చెబుతున్నాను అని అంటాడు. అది వినగానే అవునా చాలా ఆశ్చర్యంగా ఉంది అసలు నేను కూడా నిన్ను చాలా కాలంగా ప్రేమిస్తున్నాను నాకు కూడా చెప్పాలని భయంతో చెప్పలేదు ఈరోజు నువ్వే నాకు చెప్పేసరికి చాలా ఆశ్చర్యం వేసింది అని అద్వైత చెబుతుంది. అలా వారి వారి విషయాలను మాట్లాడుకొని కొద్దిసేపు అలా కలిసి తిరిగి కాలేజీ కి వెళ్తారు. కాలేజీలో క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఇన్ తెలిసి చాలా కష్టపడి ఇద్దరు ఉద్యోగం సంపాదిస్తారు. ఆ విషయం తల్లిదండ్రులు తెలిసి ఎంతో సంతోషిస్తారు. రెండు సంవత్సరాల తర్వాత వాళ్ళ ప్రేమ విషయం వాళ్ల తల్లిదండ్రులకు చెప్పి ఒప్పిస్తారు. అలా వారు వివాహం తీసుకొని సంతోషంగా ఉంటారు.
ది ఎండ్ Seshu Kumar

Comments

Post a Comment