Why Farmers

 రైతులు దేశానికే వెన్నుముక అని చెప్పుకునే మనదేశంలో,ఆ  రైతుకే వెన్నువిరిగే పరిస్థితి వచ్చింది. ప్రపంచానికి అన్నం పెట్టే రైతన్నకే అన్నం కరువైంది. ఈ దుస్థితికి కారకులెవరు కేంద్ర ప్రభుత్వమా? రాష్ట్ర ప్రభుత్వమా?

గత కాలంగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చేసే సంస్కరణలతో రైతులు సతమతమవుతున్నారు.కేంద్ర వ్యవసాయ చట్టాలు ఈ కోవకు చెందినవే. వ్యవసాయ చట్టాలను రద్దు చేయడం కొరకు దేశవ్యాప్తంగా రోజుల తరబడి రైతులు నిరసన చేపట్టవలసిన పరిస్థితి నెలకొంది.ఇటువంటి చట్టాలు రైతు వ్యవస్థనే మరుగున పడేలా కార్పొరేట్ సంస్థలకు లాభం చేకూర్చేలా ఉన్నాయి. అన్ని వ్యవస్థలను ప్రైవేటీకరణ చేస్తున్న కేంద్ర ప్రభుత్వం,రైతు వ్యవస్థను కూడా కార్పొరేట్ చేతుల్లోకి వెళ్ళేలా చేస్తుంది.మా ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అని చెప్పుకునే ఈ ప్రభుత్వాలు  రైతు సంక్షేమం కొరకు చేసిన సంస్కరణలు శూన్యం. అలాగే రైతు అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన బడ్జెట్ కూడా శూన్యమే.

కార్పొరేట్ సంస్థలకు ఎన్నో రాయితీలు కల్పించే ప్రభుత్వాలు, వ్యవసాయ ఎరువులు విషయంలో మాత్రం రాయితీలు తొలగించడం ఏమిటి?

ఒక కార్పొరేట్ సంస్థకు నష్టాలు అంటే వెంటనే ఆ సంస్థను పునరుద్ధరించడానికి చేసే ప్రయత్నాల వంటీవి రైతుల కోసం చేయడం లేదు. కార్పొరేట్ సంస్థలకు కు విద్యుత్ చార్జీలు మాఫీ చేస్తారు గాని  వ్యవసాయ కరెంట్ చార్జీలను మాత్రం రైతుల ముక్కు పిండి మరీ వసూలు చేస్తారు.
అసలే చాలిచాలక వస్తున్న  ఆదాయం తో సతమతమవుతున్న రైతును ఇటువంటి చార్జీల భారంతో మరింత కుంగిపోయెల చేస్తున్నారు.స్వేచ్ఛ వ్యవసాయం మర్చిపోయి బానిస వ్యవసాయం చేసే పరిస్థితి  నెలకొంటుంది. 'మేము చెప్పిన పంటే పండించాలి' అనడం దీనికి నిదర్శనం.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆహార కొరతతో రోజురోజుకు ఆకలి చావులు పెరుగుతున్నాయి. ఇటువంటి తరుణంలో ఆహారం పండించే రైతులను నియంత్రించడం తగునా?

WHO లెక్కల ప్రకారం ప్రతి సంవత్సరం 30 లక్షల మంది పిల్లలు  ఆకలితో చని పోతున్నారు. ఆహారం పండించి ఎగుమతి చేసే స్తోమత ఉన్న మన దేశం నుండి  ఆహారం పంపించకుండా చేస్తున్నారు. దీనికితోడు కుంటి సాకులు చెబుతూ కాలం ఎలా దిస్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆహార కొరతను అధిగమించడానికి మన దేశం నుండి  ఆహార ధాన్యాన్ని ఎగుమతి చేయడం వల్ల ప్రపంచానికి మరియు రైతన్నలకు సాయం చేసిన వాళ్లు అవుతారు.
ఇప్పటికైనా  ప్రభుత్వాలు మేలుకొని మరింత మంది ప్రజలను మరియు రైతులను వ్యవసాయం చేసేలా సంస్కరణలు తీసుకోచ్చి తగిన వనరులు కల్పించాలి.
తను పస్తులుంటూ మనందరి  కడుపులు నింపుతున్న రైతన్నలకు  మా పాదాభివందనాలు.
జై జవాన్ జై కిసాన్.

Comments