Posts

Showing posts from March, 2022

సమాలోచన

  అద్వైత తన బిటెక్ పూర్తి చేసుకొని  ఎంటెక్ చేయాలి  అని అనుకుంటున్న సమయంలో వాళ్ల తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూస్తూ ఉంటారు. అద్వైత స్వాతంత్రగా ఉండటం ఇష్టం.ఎవరి మీద ఆధారపడకుండా జీవించాలి అని నిచ్చంచుకుంటది. అద్వైత వాళ్ల నాన్న ఒక మామూలు  ఉద్యోగి, వాళ్ళ అమ్మ గృహిణి. అద్వైత ఒక అన్న ఉంటాడు. అన్న ఏమో పని పాట లేకుండా తిరుగుతుంటాను. కూతురికి పెళ్లి చేసి అత్తగారి పంపితే తన బాధ్యత తీరిపోతుందని అద్వైత నాన్న భావిస్తాడు. అద్వైత కి మెకానికల్ ఆటోమొబైల్ ఇంజనీర్ కావాలని కోరిక. దీని గురించి వాళ్ళ అమ్మ నాన్న తో చెబుతుంది వాళ్ల నాన్న మాత్రం చదివింది చాలు అని అంటాడు. అప్పుడు వాళ్ళ నాన్న తో గొడవ పడి నేను పెళ్లి చేసుకోను అని ఖండిగా చెబుతుంది. అప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నతో  మాట్లాడి ఒప్పిస్తుంది. తను చాలా కష్టపడి ఎంటెక్ అడ్మిషన్ పొందుతుంది. కాలేజీలో జాయిన్ అయిన కొన్ని రోజులు వరకు వాళ్ళ బంధువుల ఇంటి నుండి కాలేజీ కి వెళుతుంది. అలా వెళ్తున్న తనకి ఒకరోజు బస్టాండ్ లో అన్వేష్  తారసపడతాడు. అతను ఒక వృద్ధుడి తో మాట్లాడుతూ కనబడతాడు.  అలా రోజు బస్టాండ్ లో అన్వేష్ ని చూస్తూ ఉంటది.అ...